శ్రీ జగన్నాథ రథయాత్ర ఈ ఏడాది రెండు రోజులు పాటు జరగనుంది. 53 ఏళ్ళ తర్వాత ఈ ఘటన పునరావృతం కావడం విశేషం.
ఈ నెల 22న దేవస్నాన పౌర్ణమి, జులై 7న విశ్వ ప్రసిద్ధ రథయాత్ర ఉంటుంది. తిథి, నక్షత్రాల ప్రకారం ఈసారి ఒనొసొనొ అంటే చికటి మందిరంలో జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల రహస్య సేవలు 13 రోజులు నిర్వహిస్తారు. రథయాత్ర రోజే పురుషోత్తముడి నేత్రోత్సవం నిర్వహించాల్సి ఉంది. 53 ఏళ్ళ తర్వాత తిథి, వార నక్షత్రాల కారణంగా ఈ ఘటన పునారావృతమైంది. జులై 7న యాత్ర క్రతువు ముగిసే సమయానికి రాత్రి అవుతోంది. ఆ సమయంలో రథలు లాగకూడదు. దీంతో జులై 8న రథాలు లాగే కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.
పూరీ నీలాద్రి భక్తనివాస్లో శ్రీక్షేత్ర పాలనాధికారి వీర్ విక్రం యాదవ్ అధ్యక్షతన జరిగని సమావేశంలో కలెక్టరు సిద్ధార్థ్ శంకర్ స్వయిన్, ఎస్పీ పినాకిమిశ్ర పాల్గొన్నారు.
ఈ నెల 22న దేవస్నాన యాత్ర జరుగుతుంది. ఉదయం నాలుగు గంటలకు చతుర్ధామూర్తుల పొహండి ప్రారంభించి ఆరుగంటలకు ముగిస్తారు. అనంతరం చతుర్దామూర్తులకు స్నానవేడుక నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 తర్వాత జగన్నాథుడి గజానన అవతారం ఏర్పాట్లు ప్రారంభం అవుతాయి. మంగళహారతి తరువాత భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పిస్తారు. రాత్రి 10.30 తరువాత చీకటి మందిరానికి మూర్తులను తరలించి రహస్య సేవల ఘట్టం ప్రారంభిస్తారు. ఈ క్రతువు 13 రోజులపాటు సాగుతోంది. .
జులై 7న నేత్రోత్సవం, రథయాత్ర ఒకే రోజు జరగనుంది. దీంతో శ్రీక్షేత్రంలో ప్రత్యేసేవలు చేపడతారు. ఆనవాయితీ ప్రకారం తొలుత బలభద్రుని తాళధ్వజ రథం పెంచిన తల్లి (గుండిచాదేవి) ఆలయానికి బయలు దేరాలి. దీంతో రథాన్ని ఒక్క అడుగు రథం ముందుకు లాగి నిలిపివేస్తారు. మూడు రథాలు రాత్రంతా శ్రీక్షేత్రం వద్దే ఉండిపోతాయి. 8న మూడు రథాలు గుండిచా దేవి సన్నిధికి చేరతాయి. జులై 15న బహుడా యాత్ర, 16న సున్నాభెషో ఉత్సవం నిర్వహిస్తారు.