ముఖ్యమైన విషయాల్లో కలసి పనిచేసేందుకు తాము సిద్దంగా ఉన్నామంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. జీ7 దేశాల సమావేశాల్లో ప్రధాని మోదీతో ట్రూడో చర్చలు జరిపారు. మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ట్రూడో శుభాకాంక్షలు తెలిపారు. సున్నితమైన విషయాలను పక్కనబెట్టి, ముఖ్యమైన విషయాల్లో భారత్తో కలసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్యకొనసాగుతోన్న దౌత్య ఉద్రిక్తతలు కొంత మేర తగ్గినట్లైంది.
ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత నిఘా సంస్థ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. అవకాశం దొరికిన ప్రతిసారి నిజ్జర్ హత్యపై ట్రూడో చేసిన వ్యాఖ్యలు వివాదానికి ఆజ్యం పోశాయి. జీ 20 సమావేశాల్లోనూ ప్రధాని మోదీకి ట్రూడో అంటీముట్టనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిచ్చింది. ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టడంతో ఇక కెనడా ప్రధాని ట్రూడో దిగివచ్చారు. ముఖ్యమైన విషయాల్లో భారత్తో కలసి పనిచేసేందుకు సిద్దమంటూ ప్రకటించడం విశేషం.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు