గంగా దసరా పర్వదినం సందర్భంగా వారణాసిలోని గంగా దశాశ్వమేధ ఘాట్‌లో పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తారు. గంగా నదీ తీరానికి పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఘాట్ల వద్ద ఆద్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రయాగ్‌రాజ్, అయోధ్య, హరిద్వార్‌లోని ఘాట్ల వద్ద భక్తులతో నదీ తీరం కిటకిటలాడుతోంది.
భక్తులకు భద్రత కల్పించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ ప్రశాంత్‌కుమార్ తెలిపారు. ఉత్సవాల నేపధ్యంలో తలెత్తుతున్న వివాదాలకు చెక్ పెట్టేందుకు ఊరేగింపు కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని పోలీసులకు డీజపీ ఆదేశాలు జారీ చేశారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో యూపీ-112 వాహనాలను మోహరించాలన్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు