వైద్య విద్యలో ప్రవేశానికి దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షా పత్రాల లీక్‌పై అనుమానాలు బలపడుతున్నాయి. బిహార్ కేంద్రంలో నీట్ ప్రశ్నాపత్రాలు లీకైనట్లు అనుమానిస్తున్నారు. నీట్ ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారంలో ఇప్పటికే నలుగురికి బిహార్ సెట్ అధికారులు అరెస్ట్ చేశారు. మరో 9 మంది కోసం గాలిస్తున్నారు. మొత్తం 13 మందికి నీట్ ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారంలో సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు. నీట్ యూజీ 2024 ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం తేల్చేందుకు బిహార్ ప్రభుత్వం ఇప్పటికే సెట్ ఏర్పాటు చేసింది.
బిహార్ ప్రభుత్వంలో ఇంజనీరుగా పనిచేస్తోన్న ఓ వ్యక్తి నీట్ ప్రశ్నా పత్రాల లీక్‌లో కీలకంగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30 నుంచి రూ.32 లక్షలు వసూలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు బిహార్ సిట్ అధికారులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా నీట్ ప్రశ్నా పత్రాల లీక్ ప్రకంపనలు సృష్టిస్తోన్న వేళ, బిహార్ ప్రభుత్వం నిందితులను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.