వ్యవసాయదారులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం-కిసాన్ పథకం 17వ విడత నిధుల విడుదల తేదీ ఖరారైంది. జూన్ 18న రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.
వారణాసి పర్యటనలో ప్రధాని మోదీ ఈ నిధులు విడుదల చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని
ఎన్డీయే సర్కారు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం పీఎం-కిసాన్ ఫైలు పై పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.3.04 లక్షల కోట్లను అర్హులైన రైతుల ఖాతాల్లో అందజేసినట్లు తెలిపారు.
పీఎం కిసాన్ (pmkisan.gov.in) వెబ్సైట్ ఓపెన్ చేసి.. అందులో సాయం జమం అయింది లేనిది తెలుసుకోవచ్చు. ఆధార్ లేదా అకౌంట్ నంబర్ ఎంటర్ చేసి ‘గెట్ డేటా’ బటన్పై క్లిక్ చేస్తే వివరాలు డిస్ల్ ప్లే అవుతాయి. లబ్ధిదారులు, కేవైసీ చేయకపోతే నిధులు జమ కావు. కాబట్టి అదే వెబ్సైట్లో ఇ-కేవైసీ ఆప్షన్ ఎంపిక చేసి ప్రక్రియను పూర్తి చేయాలి.