దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామాఫోసా రెండోసారి ఎన్నికయ్యారు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల మధ్య కుదిరిన ఒప్పందంతో ప్రభుత్వం ఏర్పాటైంది. రామాఫోసాకు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, డెమోక్రటిక్ అలియన్స్, ఇతర చిన్న పార్టీలు జట్టుగా ఏర్పడ్డాయి.
విజయంపై స్పందించిన రామాఫోసా, దేశం మంచి కోసం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఓటర్లు తీర్పు చెప్పారన్నారు.
ఎన్సీకి 40 శాతం ఓట్లు పడగా డీఏకు 22 శాతం మాత్రమే పోలయ్యాయి. దశాబ్ధాల పాటు ప్రత్యర్థులుగా ఉన్న ఏఎన్సీ, డీఏ పార్టీలు ఇప్పుడు మిత్రపక్షాలుగా పోటీ చేశాయి. 30 ఏళ్ళ తర్వాత ఏఎన్సీ పార్టీ పార్లమెంటులో మెజారిటీ కోల్పోయింది.