దేశంలో ధరల మంట కొనసాగుతోంది. టోకు ధరల ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠానికి చేరింది. కూరగాయలు, ఆహార పదార్థాలు, తయారీ ఉత్పత్తుల ధరలు పెరగడమే ఇందుకు కారణం. గత మేలో టోకు ధరల సూచీ ఆధారిత ధవ్యోల్భణం 2.61 శాతం రికార్డైంది. 2023 ఫిబ్రవరిలో గరిష్ఠంగా 3.85 శాతం నమోదైంది. ఆ తరవాత గత మేలో నమోదైందే గరిష్ఠం కావడం గమనార్హం.
ఆహార పదార్థాల ద్రబ్యోల్భణం మేలో 9.82 శాతంగా నమోదైంది. కూరగాయల ద్రబ్యోల్భణం 23.60 నుంచి 32.42 శాతానికి పెరిగింది. ఉల్లిగడ్డలు 58, బంగాళా దుంపలు 64, పప్పుల సూచీలో 23 శాతం ద్రబ్యోల్భణం నమోదైంది. తయారీ ఉత్పత్తులు 0.78 శాతం పెరిగాయి. విద్యుత్, ఇంధనాలు 1.38 శాతం తగ్గాయి.