యమునా నదీ తీరంలో ప్రాచీన దేవాలయం కూల్చివేతను అడ్డుకోవాలంటూ భక్తులు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. శివాలయానికి సంబంధించిన దస్తావేజులు లేవని, శివయ్యకు ఎవరి రక్షణా అవసరం లేదంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ కేసులో పిటిషనర్‌గా శివుడిని చేర్చాలంటూ న్యాయవాది అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
యమునా నది తీరంలో ప్రాచీన శివాలయం కూల్చివేతను అడ్డుకోలేమని, నదిలో నిర్మించిన ఆలయం కూల్చివేస్తే దేవుడు కూడా సంతోషిస్తాడని, వరదల ముప్పు తగ్గుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రాచీన శివాలయం అయినా ఆ భూమి తమదేనంటూ నిరూపించుకునే దస్తావేజులు లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.