ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సాధారణపరిపాలన, శాంతి భద్రతల శాఖలతో పాటు మంత్రులకు ఇవ్వగా మిగిలిన అన్ని శాఖలు ఉన్నాయి.
జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కు గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయత్ రాజ్, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు.
టీడీపీ జాతీయ కార్యదర్శి, మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేశ్ కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖలు కేటాయించారు. వంగలపూడి అనితకు హోంశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు కేటాయించారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకార- మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ, డెయిరీ, మత్స్యశాఖ బాధ్యతలు అప్పగించారు.
మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర కు ఎక్సైజ్, గనులు, జియాలజీ అప్పగించగా, జనసేన పార్టీ పీఏసీ నేత, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కు ఆహార, పౌర సరఫరాల శాఖలు కేటాయించారు.
నెల్లూరు సీటీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పొంగూరు నారాయణకు పురపాలక , పట్టణాభివృద్ధి శాఖలు కేటాయించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆయన ఇవే మంత్రిత్వ శాఖలు నిర్వర్తించారు
బీజేపీ జాతీయ కార్యదర్శి, హిందూపురం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ కు కీలక శాఖ దక్కింది. వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖలు కేటాయించారు.
టీడీపీ పొలిటిబ్యూరో సభ్యుడైన నిమ్మల రామానాయుడుకు జల వనరుల అభివృద్ధి శాఖ దక్కింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి శాసనసభకు ఎన్నికైన ఆనం రామనారాయణరెడ్డికి దేవాదాయ శాఖ బాధ్యతలు అప్పగించారు. మహ్మద్ ఫరూఖ్ కు న్యాయ శాఖ, మైనారిటీ సంక్షేమం శాఖలు కేటాయించగా, ఉరవకొండ ఎమ్మెల్యే
పయ్యావుల కేశవ్ కు ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల బాధ్యతలు అప్పగించారు. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపులు శాఖల బాధ్యతలు అప్పగించారు. నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి గృహ నిర్మాణం, సమాచారం, ప్రజా సంబంధాల శాఖ కేటాయించారు.
డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాల శాఖ అప్పగించగా, గొట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖ కేటాయించారు.
కందుల దుర్గేశ్ – టూరిజం, సాంస్కృతి శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ
గుమ్మిడి సంధ్యారాణి- మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం
బీసీ జనార్దన్ రెడ్డి- రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు
టీజీ భరత్- పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్
ఎస్.సవిత- బీసీ సంక్షేమం, బలహీనవర్గాల సంక్షేమం, చేనేత, టెక్స్ టైల్స్
వాసంశెట్టి సుభాష్- కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, ఆరోగ్య బీమా సేవలు
కొండపల్లి శ్రీనివాస్- సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్నారై సాధికారత, సంబంధాలు
మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి- రవాణా, క్రీడలు, యువజన సర్వీసులు