దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం జాతీయగీతం ఆలపించడం తప్పనిసరి. అయితే జమ్ము కశ్మీర్లో ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి లేదు. తాజాగా ప్రతి రోజూ ఉదయం పాఠశాల ప్రారంభానికి ముందు జాతీయ గీతం తప్పనిసరిగా ఆలపించాలని జమ్ముకశ్మీర్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్ము కశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు.370 ఆర్టికల్ రద్దు తరవాత జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకతలు తొలగిపోయాయి.
పాఠశాలల్లో జాతీయగీతంతోపాటు ప్రతి రోజూ విద్యార్థులతో పలు అంశాలపై ప్రసంగాలను ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల పలు అంశాలపై అవగాహనతోపాటు, విద్యార్థుల్లో భయాలు తొలగిపోనున్నాయి. ఇందుకు 16 అంశాలను ఎంచుకున్నారు. సమాజంలోని ప్రస్తుత పరిస్థితులు, చారిత్రాత్మక అంశాలను విద్యార్థుల ప్రసంగాల్లో చోటు చేసుకల్పించారు.