లోక్‌సభ సమావేశాలకు రంగం సిద్దమైంది. జూన్ 24 నుంచి జులై 3 వరకు లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. 18వ సభకు ఎన్నికైన ఎంపీల ప్రమాణస్వీకారం, స్పీకర్ ఎన్నిక పూర్తి చేయనున్నారు. ఇక వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జులై 22 నుంచి ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. జులై 22న పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడతారు. జూలై 3న ఆర్థిక సర్వే ప్రకటించనున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ 7వ బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డ్ సృష్టించబోతున్నారు. కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టాల్సి ఉండగా సార్వత్రిక ఎన్నిక కారణంగా, తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. వర్షాకాల సమావేశాల్లో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వర్షాకాల సమావేశాలు జులై 22 నుంచి ఆగష్ట్ 9 వరకు జరపనున్నారు.