ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ తొలి సమావేశం ఈ నెల 18న జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. శాసనసభ సమావేశాలు ఈ నెల 19 నుంచి జరిగే అవకాశాలున్నాయి.
నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, బడ్జెట్ ఆమోదానికి శాసనసభ సమావేశం నిర్వహించనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టగా జనసేన, బీజేపీ, టీడీపీకి చెందిన 24 మంది ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ సాయంత్రం బాధ్యతలు స్వీకరించగా, మంత్రులు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. వారికి ఇంకా శాఖలు కేటాయించలేదు. నేడు మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్టు తెలుస్తోంది.