మానసిక ఆరోగ్యం సరిగా లేని ఓ ఆరేళ్ల బాలికను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న బీజేపీ సీనియర్‌నేత, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు సదాశివనగర కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ ఏడాది మార్చిలో నమోదైన కేసు విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు యడియూరప్పకు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 17న కర్ణాటక సీఐడి ముందు యడియూరప్ప హాజరు కావాల్సి ఉంది. విచారణకు పిలిచి తరవాత అరెస్ట్ చూపుతారనే వార్తలు గుప్పుమనడంతో కేసును కొట్టి వేయాలని బెంగళూరు హైకోర్టును ఆశ్రయించారు.
బెంగళూరు సీఐడి విచారణ పిలిచి అరెస్ట్ చేస్తారనే వార్తల నేపథ్యంలో యడియూరప్ప ముందస్తు బెయిల్‌కు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్రమంగా తనపై కేసు నమోదు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ నేతలపై వేధింపులకు దిగుతోందని యడియూరప్ప విమర్శలు గుప్పించారు.