హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల శాసనసభల్లో ఉప ఎన్నికలు జరగనున్న స్థానాలకు బీజేపీ తమ అభ్యర్ధులను ప్రకటించింది.
హిమాచల్ ప్రదేశ్‌లో దేహార్ నియోజకవర్గానికి హోషియార్‌సింగ్ చంబ్యాల్, హమీర్‌పూర్ నియోజకవర్గానికి ఆశిష్ శర్మ, నాలాగఢ్ నియోజకవర్గానికి క్రిషన్‌లాల్ ఠాకూర్‌లను అభ్యర్ధులుగా ప్రకటించింది.
మధ్యప్రదేశ్‌లోని అమర్‌వారా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధిగా కమలేష్ షా ఎంపికయ్యారు.
ఉత్తరాఖండ్‌లో బదరీనాథ్ నియోజకవర్గానికి రాజేంద్రసింగ్ భండారీ, మంగ్లౌర్ నియోజకవర్గానికి కర్తార్‌సింగ్ భడానా బీజేపీ అభ్యర్ధులుగా బరిలోకి దిగుతున్నారు.
దేశంలో 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. బిహార్, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క స్థానానికి, ఉత్తరాఖండ్‌లో 2 సీట్లకు, హిమాచల్ ప్రదేశ్‌లో 3 నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్‌లో 4 స్థానాలకూ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్ధులు రాజీనామా చేయడం లేక మరణించడం వల్ల ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.
ఎన్నికల సంఘం జూన్ 10న ఉప ఎన్నికల ప్రకటన విడుదల చేసింది. అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేయడానికి జూన్ 21 వరకు సమయం ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 26 వరకూ గడువుంది. ఎన్నికలు జులై 10న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు జులై 13న జరుగుతుంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు