అజిత్ దోవల్ ను జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి కొనసాగిస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడోసారి ఆయన ఈ పదవిలో కొనసాగడం విశేషం.
ప్రధాన మంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా డాక్టర్ పీకే మిశ్రాను నియమించారు. ఈనెల 10 నుంచి ఆ నియామకం అమలులోకి రానుంది. పీకే మిశ్రాకు కేబినెట్ హోదా కల్పించనున్నారు. ప్రధాని మోదీకి సలహాదారులుగా అమిత్ ఖేర్, తరుణ్ కపూర్లను నియమించారు. వారి పదవీకాలం రెండేళ్ళుగా నిర్ణయించారు.