టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టారు. నేటి(గురువారం) సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌లోని తన ఛాంబర్లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధశాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల హామీ మేరకు సీఎం చంద్రబాబు , మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేశారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీవ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు ఫైల్‌పై రెండో సంతకం, సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపు ఫైలుపై మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు.
ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం నుంచి సచివాలయం వరకు అమరావతి రైతులు పూలు చల్లి స్వాగతం పలికారు. సీఎం కాన్వాయ్ వెంట పరుగులు పెడుతూ జై చంద్రబాబు, జై అమరావతి అని నినదించారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు