కర్ణాటకలో రేణుకా స్వామి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. రేణుకా హత్యతో ప్రమేయం ఉందంటూ పోలీసులు ఇప్పటికే నటుడు దర్శన్ తూగుదీపను అరెస్ట్ చేసి విచారించారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. హత్యా నేరం తమపై వేసుకుంటే ఒక్కొక్కరికి రూ.5 లక్షలు చొప్పున మొత్తం రూ.15 లక్షలు ఇస్తానని దర్శన్ ఆఫర్ ఇచ్చినట్లు ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన నిందితులు వెల్లడించారు.
గత మంగళవారం మైసూరు సమీపంలో ఓ కాలువలో మహిళ శవాన్ని గుర్తించిన ఫుడ్ డెలివరీ బాయ్ పోలీసులకు సమాచారం అందించాడు. వారు వచ్చి పరిశీలించగా అది రేణుకాస్వామి మృతదేహమని గుర్తించారు. అంతకు ముందు రేణుకా స్వామి దర్శన్ భార్యకు అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు పంపినట్లు పోలీసులు గుర్తించారు. హత్య జరిగే సమయంలో దర్శన్, నిందితులతో నిరంతరం ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు కాల్ డేటా ద్వారా పోలీసుల గుర్తించారు.