తన ఉరిశిక్షను రద్దుచేయాలనీ, క్షమాభిక్ష పెట్టాలనీ పాకిస్తానీ ఉగ్రవాది మహమ్మద్ ఆరిఫ్ పెట్టుకున్న పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. దేశ భద్రత, సార్వభౌమాధికారంపై దాడి చేసిన వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు.
2000 సంవత్సరంలో డిసెంబర్ 22న ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర, పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడిన నలుగురు లష్కర్-ఎ-తయ్యబా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఆ ఘటనలో ముగ్గురు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజుల తర్వాత ఢిల్లీ పోలీసులు ఆ ఉగ్రవాదుల్లో ఒకడైన మహమ్మద్ ఆరిఫ్‌ను అరెస్ట్ చేసారు. మిగిలిన ముగ్గురు ఉగ్రవాదులూ తర్వాత వేర్వేరు ఎన్కౌంటర్లలో హతమయ్యారు.
మహమ్మద్ ఆరిఫ్ ఢిల్లీలోని ట్రయల్ కోర్టు 2005 అక్టోబర్‌లో మరణశిక్ష విధించింది. ఆ తీర్పును ఢిల్లీ హైకోర్టు 2007లోనూ, సుప్రీంకోర్టు 2011లోనూ సమర్థించాయి. నిందితుడికి ట్రయల్ కోర్టు విధించిన శిక్షను అమలు తీయాలని ఆదేశించాయి.
మరణశిక్షను తప్పించుకోడానికి ఆరిఫ్ మహమ్మద్ అన్ని ప్రయత్నాలూ చేసాడు. ఎన్నో అప్పీళ్ళు, రివ్యూ పిటిషన్లు పెట్టుకున్నాడు. కానీ అవేవీ ఫలించలేదు. చిట్టచివరి ప్రయత్నంగా ఈ యేడాది మే 15న రాష్ట్రపతికి క్షమాభిక్ష అర్ధిస్తూ పిటిషన్ పెట్టుకున్నాడు.
ఆ పిటిషన్‌ను మే 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. దేశ సార్వభౌమాధికారానికి గొడ్డలిపెట్టుగా, దేశ భద్రతను బలహీనపరిచేలా దాడి చేసిన పొరుగుదేశపు ఉగ్రవాదికి క్షమాభిక్ష పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. ఆ విషయాన్ని రాష్ట్రపతి భవన్ వర్గాలు ఇప్పుడు బహిర్గతం చేసాయి.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు