ఉచితంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ఉదయ్ మరో అవకాశం కల్పించింది. మూడు నెలల కిందట ఇచ్చిన అవకాశం రేపటితో ముగియనుంది. దీంతో యూఐడిఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి పదేళ్లకు ఒకసారి ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఆధార్ అప్డేట్ ఉచితంగా చేసుకునే అవకాశాన్ని సెప్టెంబరు 14 వరకు పొడిగిస్తూ ఉదయ్ నిర్ణయం తీసుకుంది.
ఆధార్లో ఫోటోలు, పేరు, చిరునామాలాంటి వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. దీనికి
సంబంధించిన వివరాలు అప్ లోడ్ చేయాల్సి ఉంది. మై ఆధార్ వెబ్సైట్లో మాత్రమే ఉచిత సేవలు లభిస్తాయి. మరో మూడు నెలలు ఉచిత అప్డేట్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆ తరవాత ఎప్పటి మాదిరే రూ.50 చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు.