నీట్ అండర్ గ్రాడ్యుయేట్ 2024 ప్రవేశపరీక్షలో గ్రేస్‌మార్కులు ఇచ్చిన 1563 మంది అభ్యర్ధుల స్కోర్‌కార్డులు రద్దు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని సుప్రీంకోర్టుకు ఇవాళ తెలియజేసింది.
స్కోర్‌కార్డులు రద్దు చేసిన 1563మంది విద్యార్ధులకు మరోసారి పరీక్ష రాసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కేంద్రం న్యాయస్థానానికి వెల్లడించింది. ‘‘ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి కమిటీ జూన్ 10, 11, 12 తేదీల్లో సమావేశమైంది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు, ప్రభావిత అభ్యర్ధుల స్కోరుకార్డులు రద్దుచేస్తున్నాం. వారికి మళ్ళీ పరీక్ష పెడతాం’’ అని తెలియజేసింది.
మరోవైపు, నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియను ఆపకూడదని సుప్రీంకోర్టు మరోసారి తేల్చి చెప్పింది. ‘‘కౌన్సెలింగ్ ప్రక్రియ ముందు నిర్ణయించిన ప్రకారమే జరుగుతుంది, ఆ ప్రక్రియను ఆపే ప్రసక్తే లేదు. పరీక్ష కొనసాగితే మిగతా ప్రక్రియ అంతా యథాతథంగా కొనసాగుతుంది. కాబట్టి ఆందోళన అక్కర్లేదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
రీ-టెస్ట్ జూన్ 23న జరుగుతుంది. దాని ఫలితాలు జూన్ 30న ప్రకటిస్తారు.
నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై అన్ని పిటిషన్లనూ జులై 8 న పరిశీలిస్తామని న్యాయస్థానం వెల్లడించింది.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు