నీట్ యూజీ 2024 పరీక్షలు నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజన్సీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్రేస్ మార్కులపై విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడంతో ఈ తీర్పు వెలువరించింది. గ్రేస్ మార్కులు తొలగించినట్లు ఎన్టీఏ ప్రకటించింది. గ్రేస్ మార్కులు కావాలనుకునే వారు ఈ నెల 23న నీట్ పరీక్ష మరలా రాయాల్సి ఉంటుందని ఎన్టీఏ ప్రకటించింది. ఫలితాలు ఈ నెల 30న రానున్నాయి.
నీట్ ఫలితాలపై వివాదం చుట్టుముట్టిన విషయం తెలిసిందే. మొదటి ర్యాంకు 67 మందికి రావడం, గ్రేస్ మార్కుల వివాదం, ఒకే పరీక్ష కేంద్రంలో 8 మందికి ఒకే ర్యాంకు రావడంపై దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. కొందరు కోర్టులను ఆశ్రయించారు. వచ్చే నెల 8వ తేదీ లోగా గ్రేస్ మార్కులపై సమాధానం ఇవ్వాలని నేషనల్ టెస్ట్ ఏజన్సీని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు