అరుణాచల్‌ప్రదేశ్ సీఎంగా పెమా ఖండూ మూడోసారి బాధ్యతలు చేపట్టారు. నేటి ఉదయం 11 గంటలకు ఆయన సీఎంగా పెమా ఖండూ ప్రమాణం చేశారు. 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 46స్థానాల్లో విజయం సాధించింది.నేషనల్ పీపుల్స్ పార్టీ (NPEP)ఐదు స్థానాల్లో గెలుపొందింది. NCP మూడు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (PPA) రెండు, కాంగ్రెస్ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. మొత్తం 60 స్థానాల్లో ఎన్నికలకు ముందే 10 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. సీఎం పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ సహా ఇతర మంత్రులు ప్రమాణం చేశారు.
పెమా ఖండూ(44) తండ్రి మాజీ సీఎం దోర్జీ ఖండ్ మరణంతో 2011లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.దీంతో పెమా ఖండూ రాజకీయాల్లో ప్రవేశించి తన తండ్రి గెలిచిన స్థానం పోటీ చేసి విజయం సాధించారు.
2016లో అప్పటి ముఖ్యమంత్రి నబంటుకీపై తిరుగుబాటు చేసిన తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరారు.కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడంతో ముఖ్యమంత్రిగా ఖండూ బాధ్యతలు చేపట్టారు.2019లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.ప్రస్తుతం మూడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.