ఒడిషా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మోహన్ చరణ్ మాఝీ తన మొదటి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవన్లో జరిగిన ఆ సమావేశంలో నాలుగు నిర్ణయాలు తీసుకున్నారు.
పూరీ జగన్నాథ స్వామి ఆలయం నాలుగు ద్వారాలనూ గురువారం (నేటి) నుంచీ మళ్ళీ తెరుస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
‘‘గురువారం తెల్లవారుజామున మంగళహారతి ఇచ్చే సమయంలో భక్తుల కోసం ఆలయం నాలుగు ద్వారాలూ తెరుస్తారు. ఆ సందర్భంగా మంత్రులందరూ ఆలయంలో దర్శనం చేసుకుంటారు’’ అని మాఝీ వెల్లడించారు.
12వ శతాబ్దానికి చెందిన పూరీ జగన్నాథ ఆలయం అభివృద్ధి కోసం 500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఒడిషాలో వరి పంటకు కనీస మద్దతు ధరను రూ 3100కు పెంచడానికి ఒక విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మహిళలకు రూ. 50వేలు ఇచ్చే ‘సుభద్ర’ పథకాన్ని వంద రోజుల్లోగా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే వోచర్లను రెండేళ్ళలోగా నగదుగా మార్చుకోవచ్చు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు