ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తరవాత మోదీ జీ7 దేశాల సమ్మిట్‌లో పాల్గొనేందుకు కాసేపట్లో ఇటలీకి బయలుదేరనున్నారు. ఇవాళ ఇటలీలో ప్రారంభమయ్యే సమావేశాలు శనివారం వరకు జరగనున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్, యూరోపియన్ యూనియన్, భారత్ దేశాల కూటమి జీ7. ప్రపంచంలోనే అత్యంత బలమైన కూటముల్లో జీ7 ఒకటి.
ఏడు దేశాలకు చెందిన దేశాధినేతలు ఈ సమావేశాల్లో పాల్గోనున్నారు.ప్రపంచ శాంతి, పర్యావరణం, భవిష్యత్ సవాళ్లపై ముఖ్యంగా ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ప్రపంచం ఎదుర్కొంటోన్న సవాళ్లపై దేశాధినేతలు చర్చించనున్నారు. 50వ సమావేశం నేడు ఇటలీలో ప్రారంభం కానుంది.
ఇటలీలో జీ7 దేశాధినేతల సమావేశం ప్రారంభానికి ఒక రోజు ముందు ఖలిస్థాన్ మద్దతుదారులు రెచ్చిపోయారు. రోమ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఖలిస్థాన్ మద్దతుదారులు ధ్వంసం చేశారు. అక్కడ దిమ్మెపై ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్‌ను కీర్తిస్తూ నినాదాలు రాశారు. దీనిపై భారత విదేశాంగశాఖ అధికారులు స్పందించారు. ఇటలీలోని ఎంబసీ అధికారులతో మాట్లాడారు. ఇప్పటికే అక్కడ ధ్వంసం చేసిన మహాత్మాగాంధీ విగ్రహ ముక్కలను శుభ్రం చేశారు. నిందితుల కోసం ఇటలీ పోలీసులు గాలిస్తున్నారు.