కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వంలో 18వ లోక్‌సభ ఈ నెల 24 నుంచి వచ్చే నెల 3 వరకు సమావేశం కానుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతానికి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. స్పీకర్ ఎంపిక తరవాత ఐదు రోజులే సమయం ఉంటుంది. బడ్జెట్‌పై చర్చించి ఆమోదించడం సాధ్యం కాకపోవచ్చు. జులై మూడో వారం నుంచి మొదలయ్యే వర్షాకాల సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌పై చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది.
ఎన్నికల ఏడాది కావడంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత ఫిబ్రవరి 1న తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. పూర్తి స్థాయి బడ్జెల్ జులై చివరి వారంలో ప్రవేశ పెట్టనున్నారు. మరో బడ్జెట్ ప్రవేశపెడ్డితే నిర్మలా సీతారామన్ ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డుల కెక్కనుంది. పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు జులై 17 నుంచి ఆగష్టు 7 వరకు నిర్వహించనున్నారు.
కొత్తగా గెలిచిన ఎంపీల ప్రమాణ స్వీకారానికే మూడు రోజుల సమయం పట్టే అవకాశముంది. ఇక బడ్జెట్‌పై చర్చకు పెద్దగా సమయం దొరికే అవకాశం లేదు. స్పీకర్ ఎంపిక, సభ్యుల ప్రమాణ స్వీకారం తరవాత సభ వాయిదా పడనుంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు