జమ్మూకశ్మీర్లో రియాసీ వద్ద టూరిస్ట్ బస్సుపై దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడి ఊహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ వెల్లడించిన వారికి రూ.20 లక్షలు బహుమతిగా ఇస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు పోలీసులు స్కెచ్ ను తయారు చేశారు.
గత ఆదివారం దుండగులు దుశ్చర్యలకు పాల్పడ్డారు. శివ్ఖోరీ ఆలయం నుంచి మాతా వైష్ణవిదేవి గుడికి బయల్దేరిన భక్తుల బస్సుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ముష్కరుల కాల్పుల్లో తొమ్మిది మంది భక్తులు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత దోడా, కథువా జిల్లాల్లో వరుసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. జాయింట్ ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టారు.
కథువాలో నిన్న రాత్రి ఎన్కౌంటర్ ప్రారంభమైన వెంటనే దోడా వద్ద పాకిస్తాన్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. ఎదురు కాల్పుల్లో ఓ జవాన్ సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.