ఆంధప్రదేశ్ లో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన పవన్ కల్యాణ్, నారా లోకేశ్ సహా 24 మంది మంత్రులుకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నూతన ప్రభుత్వానికి ఆశీస్సులు అందజేశారు.
“ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నాను. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబుకు, మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి శుభాకాంక్షలు.’’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ను ఉజ్వలమైన భవిష్యత్తు వైపు, అభివృద్ధి దిశగా నడిపేందుకు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందన్నారు. యువత ఆశలను కొత్త ప్రభుత్వం నెరవేర్చుతుందని ఆకాంక్షించారు.