జమ్మూకశ్మీర్‌లోని దోడా ప్రాంతంలో ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడ్డారు. గత రాత్రి ఆర్మీ బేస్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆర్మీ ఎదురుకాల్పులకు దిగింది. ఈ బుల్లెట్ ఫైట్ లో ఐదుగురు సైనికులు, ఓ స్పెషల్ పోలీసు ఆఫీసర్ గాయపడ్డారు.
గడిచిన మూడు రోజుల్లో జమ్మూలో కాల్పులు జరగడం ఇది మూడోసారి. తొలుత కథువాలో ఘాతుకానికి దిగారు. ముష్కరుల కాల్పుల్లో ఓ పౌరుడు గాయపడ్డాడు. ఇక రియాసి జిల్లాలో భక్తులతో వెళ్తున్న బస్సుపై దాడికి పాల్పడ్డారు. కాల్పుల్లో 9 మంది ప్రయాణికులు మరణించారు.
కథువాలో గత రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాదిని ముట్టుబెట్టినట్లు జమ్మూ జోన్ ఏడీజీపీ ఆనంద్ జెయిన్ తెలిపారు. దోడాలోని చత్తర్‌గాలా పరిధిలోని ఆర్మీ బేస్‌పై గత రాత్రి ఉగ్రవాదులు దాడికి దిగారు. కథువాలో తప్పించుకున్న ఓ ఉగ్రవాది జాడ తెలుసుకునేందుకు భద్రతా అధికారులు డ్రోన్లు వాడుతున్నట్లు సమాచారం.