Wednesday, July 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

‘యుకెలో హిందూద్వేషాన్ని మతద్వేష నేరంగా గుర్తించాలి’

బ్రిటిష్ పార్టీలకు హిందూ మ్యానిఫెస్టో యుకె 2024 విజ్ఞప్తి

Phaneendra by Phaneendra
Jun 11, 2024, 05:30 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

జులై 4న యునైటెడ్ కింగ్‌డమ్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఆ నేపథ్యంలో యుకెలోని హిందూ సంస్థలు ‘ది హిందూ మ్యానిఫెస్టో యుకె 2024’ విడుదల చేసాయి. హిందూ వ్యతిరేక ద్వేషాన్ని మతద్వేష నేరంగా గుర్తించాలని ఆ సంస్థలు విజ్ఞప్తి చేసాయి.

ఇంగ్లండ్‌లోని హిందూ సంస్థలు అన్నీ కలిసి ఏడు ప్రధాన డిమాండ్లతో ఒక మ్యానిఫెస్టోను జూన్ 8న విడుదల చేసాయి. హిందూద్వేషాన్ని మతద్వేష నేరంగా గుర్తించాలన్నది వాటిలో ప్రధాన డిమాండ్. దానితో పాటు… హిందువుల ఆరాధనా ప్రదేశాలను రక్షించడం, హిందువులకు చదువుకోడానికి సరైన అవకాశాలు కల్పించడం, హిందువులకు సమాన ప్రాతినిధ్యం, అవకాశాలూ కల్పించడం, ఇమిగ్రేషన్ ప్రక్రియను సరళీకరించడం, ఆరోగ్య-సామాజిక భద్రతలను మెరుగుపరచడం, హిందూ ధార్మిక విలువలను గుర్తించి పరిరక్షించడం అనే ఆరు డిమాండ్లు ఆ మ్యానిఫెస్టోలో ఉన్నాయి.    

హిందూ మ్యానిఫెస్టోకు పలువురు పార్లమెంటరీ అభ్యర్ధులు మద్దతు పలికారు. ‘‘యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హిందూ సమాజపు ఐక్య స్వరాన్ని ఈ మ్యానిఫెస్టో ప్రతిఫలిస్తోంది. ఈ ఏడు హామీలను నెరవేర్చడానికి వేర్వేరు ప్రాంతాలకు చెందిన, వేర్వేరు నేపథ్యాలు కలిగిన ప్రతినిధులు కలిసికట్టుగా ముందుకు వస్తున్నారు’’ అని హిందూ సంస్థలు వెల్లడించాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు తమతమ నియోజకవర్గాల్లోని హిందూ సమాజాలకు అండగా నిలవాలని హిందూసంస్థలు పిలుపునిచ్చాయి.

2002 సెప్టెంబర్‌లో లీసెస్టర్ ప్రాంతంలో హిందువులపై ముస్లిములు దాడులు చేసారు. ఆ దాడులు మరింత విస్తరించి, ఇతర మతస్తులపైన కూడా దాడులకు పాల్పడ్డారు. ‘సెంటర్ ఫర్ డెమొక్రసీ ప్లూరలిజం అండ్ హ్యూమన్ రైట్స్’ అనే సంస్థ క్షేత్రస్థాయి వాస్తవాలను, హింసకు ప్రేరేపించిన కారణాలను తెలుసుకోడానికి ఒక బృందాన్ని అక్కడికి పంపించింది.

‘‘లీసెస్టర్‌లో కొందరు ముస్లిం దుండగులు హిందూ దేవాలయంపై దాడి చేసి అక్కడి విగ్రహాలను ధ్వంసం చేసారు. అంతకుముందు కొన్నివారాలపాటు హిందువులపై వేధింపులు, తప్పుడు సమాచారం వ్యాప్తి, దాడులు జరిగాయి. దానికి ప్రతిస్పందనగా స్థానిక హిందూ యువకులు శాంతియాత్ర నిర్వహించారు. భయాందోళనల్లో కూరుకుపోయి ఉన్న హిందువులకు అండగా నిలిచారు’’ అని ఆ నిజనిర్ధారణ బృందం నివేదిక పేర్కొంది.

లీసెస్టర్ హింసాకాండ మరిన్ని నగరాలకు వ్యాపించింది. అంతేకాదు, ఇంగ్లీష్ మీడియా సంస్థలు హిందూ వ్యతిరేక పక్షపాత ధోరణితో వ్యవహరించి తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసాయి. ఆ వివరాలను కూడా నిజనిర్ధారణ బృందం స్పష్టం చేసింది. యుకెలోని హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఎన్నో కుట్ర సిద్ధాంతాలను ప్రచారంలో పెట్టారు. హిందూఫోబియాను వ్యాపింపజేసారు, ఆ తప్పుడు కథనాల ఆధారంగా హిందూ సమాజంపై దాడులు చేసారు అని ఆ బృందం స్పష్టం చేసింది.

అటువంటి పక్షపాత ధోరణికి వ్యతిరేకంగా, యుకెలోని హిందూ డయాస్పోరా తమ జీవితాలను హుందాగా గడిపేందుకు వీలుగా చట్టసభల ప్రతినిధులు సహకరించాలని హిందూ మ్యానిఫెస్టో కోరింది.

Tags: Anti-Hindu HateBADI BAATHindu Manifesto UK 2024SLIDERTOP NEWSUK General Election
ShareTweetSendShare

Related News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?
general

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.