బిహార్ లోని ఓ జైలులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన చైనీయుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. చైనాలోని షాండాంగ్ ప్రావిన్సుకు చెందిన లీ జియాకీ అనే వ్యక్తి సరైనా ధ్రువీకరణ పత్రాలు లేకుండా భారత్‌లోకి ప్రవేశించాడు. బ్రహ్మపురంలోని లక్ష్మీచౌక్ వద్ద సంచరిస్తుండగా పోలీసులు ప్రశ్నించారు. సరైన వీసా పత్రాలు లేకపోవడంతో పోలీసులు అతడిని జూన్ 6న అదుపులోకి తీసుకున్నారు. ఫారనర్స్ యాక్ట్ కింద లీపై కేసు నమోదు చేశారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో లీ వద్ద చైనా మ్యాపు, మొబైల్ ఫోన్, చైనా, నేపాల్, ఇండియా కరెన్సీలు దొరికినట్లు పోలీసులు తెలిపారు. లీని ముజఫర్‌పూర్ జైలుకు తరలించగా జూన్7న జైలులో లీ ఆత్మహత్యకు యత్నించాడు.
కళ్ళజోడును పగలగొట్టుకుని గాజు ముక్కతో గాయాలు చేసుకున్నాడు. తీవ్ర రక్త స్రావంతో అపస్మారకస్థి స్థితిలో జైలు గదిలో బాత్రూమ్లో పడిపోయాడు. లీ పరిస్థితిని గమనించిన పోలీసులు, చికిత్స నిమిత్తం లీని ముజఫర్‌పూర్‌లోని శ్రీ కృష్ణా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.