ఏపీ రాజ్‌భవన్ కు వెళ్ళిన ఎన్డీయే నేతలు… రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు గురించి గవర్నర్ కు లేఖ అందజేశారు. ఎన్డీయే కూటమికి 164 మంది సభ్యుల బలం ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్ తో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన పీఏసీ నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఎన్డీయే తరఫున సభానాయకుడిగా టీడీపీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబును ఎన్నుకున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వివరించారు. 164 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ కు అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయేను ఆహ్వానించాలని కోరారు.
గవర్నర్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఎన్డీయే నేతలు … తమ వినతికి గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. నిబంధనల మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని చెప్పినట్లు తెలిపారు.
గత ప్రభుత్వంపై ఉపముఖ్యమంత్రి డ్రగ్స్ వ్యాఖ్యల కలకలం