తెలుగుదేశం, జనసేన, బీజేపీ శాసనసభా పక్ష నేతగా చంద్రబాబునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ విజయవాడలోని ఏ వన్ కన్వెన్షన్ కేంద్రంలో సమావేశ మయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. ఆ వివరాలను గవర్నర్‌కు పంపనున్నారు.
ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌ను నియమిస్తారని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రితోపాటు కీలక శాఖను అప్పగించే అవకాశముంది. జనసేనకు 4, బీజేపీకి 2 మంత్రి పదవులు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రివర్గం కూర్పుపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు.ఉమ్మడి జిల్లాలు కుల, మత, ప్రాంతాలకు సమ ప్రాధాన్యం దక్కేలా మంత్రివర్గం ఉండనుంది. యువత మహిళలకు తగిన ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.