సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంటులో చర్చల తీరుపై RSS చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. ఎన్నికలు ముగిసినందున దేశ నిర్మాణంపై రాజకీయపార్టీలు దృష్టి సారించాలని కోరారు. ఎన్నికలు యుద్ధం కాదని, పోటీ మాత్రమేనని సూచించారు. ఏకాభిప్రాయం కోసం జరిగే ప్రక్రియే ఎన్నిక అని అభివర్ణించారు.
పార్లమెంటుకు రెండు పార్శ్వాలు ఉంటాయని, కాబట్టి ప్రతీ అంశాన్ని రెండు కోణాల్లో చర్చించడం ఉత్తమం అన్నారు. ప్రతీ సమస్యను ఒక పార్టీ ఒక వైపు ప్రస్తావిస్తే.. ప్రతిపక్షం మరొక కోణాన్నిలేవనెత్తాలని సలహా ఇచ్చారు.
నాగ్‌పూర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో మాట్లాడిన మోహన్ భగవత్, ప్రతీ ఐదేళ్లకోసారి ప్రజాతీర్పు వస్తుందని, అయితే ఈ ప్రజా నిర్ణయం ఎందుకు వస్తుంది..? కారణాలు ఏంటి? అనే అంశాలు ఆర్ఎస్ఎస్‌కు సంబంధించినవి కావని స్పష్టం చేశారు.
ఎన్నికలలో ప్రజాభిప్రాయాన్ని మెరుగైన రీతిలో అర్థం చేసుకోవడానికి సంఘ్ పని చేస్తుంది. ‘‘ఏకాభిప్రాయం మన సంప్రదాయం. ఆ దిశగా పురోగతి కనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియ యుద్ధం కాదు.. పోటీ మాత్రమే’’ మోహన్ భగవత్ అన్నారు.