జనసేన శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్‌ను ఎన్నుకున్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా మంగళవారం 10 గంటలకు హాజరయ్యారు. శాసనసభా పక్ష నేత పవన్ కళ్యాణ్ పేరును, నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. దీనికి అందరూ ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు.
బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ కార్యాలయంలో సమావేశం అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఈ సమావేశానికి నాయకత్వం వహించారు. అధిష్ఠానం నుంచి ఇంకా ఆదేశాలు రాకపోవడంతో ఎవరినీ పక్షనేతగా ఎన్నుకోలేదు. అధిష్ఠానం ఆదేశాలు అందరూ పాటించాలని పురంధేశ్వరి స్పష్టం చేశారు. రేపు ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా హాజరు కానున్నారని, బీజేపీ నుంచి తామంతా హాజరవుతామని ఆమె ప్రకటించారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా విష్ణుకుమార్ రాజును ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది.