పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని ప్రమాణ స్వీకారానికి సరిహద్దు దేశాలకు చెందిన దేశాధినేతలను ఆహ్వానించినా పాక్ ప్రధానికి మాత్రం ఆహ్వానం పంపలేదు. సార్క్ దేశాధినేతలంతా ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ తాజాగా భారత ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మోదీకి శుభాకాంక్షలంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ఖలిస్థాన్ వేర్పాటువాది హర్ధీప్‌సింగ్ నిజ్జర్ హత్య తరవాత కెనడా, భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. తాజాగా కెనడా ప్రధాని ట్రూడో కూడా భారత ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ట్రూడోకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు. కెనడాతో కలసి పనిచేసేందుకు భారత్ సిద్దంగా ఉందంటూ ట్వీట్ చేశారు.
ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య తరవాత కెనడా భారత సంబంధాలు బెడిసికొట్టాయి. నిజ్జర్ హత్యలో భారత నిఘా సంస్థల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతీశాయి. తాజాగా కెనడా ఇంటెలిజెన్స్ చీఫ్ రహస్యంగా భారత్‌లో పర్యటించి వెళ్లాడనే సమాచారం వైరల్ అయింది.