ప్రధానిగా ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ, కాసేపటి కిందట పీఎంవోలోని సౌత్‌బ్లాక్‌లో బాధ్యతలు స్వీకరించారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన రెండో వ్యక్తిగా మోదీ చరిత్రలో నిలిచారు.
ప్రధాని మోదీ సహా ఆదివారంనాడు 71 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వారందరికీ కాసేపట్లో శాఖలు కేటాయించనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర క్యాబినెట్ భేటీ కానుంది. కొత్త మంత్రులకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందే కాబోయే మంత్రులకు పలు సూచనలు చేసిన ప్రధాని, క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పేదల గృహనిర్మాణానికి సంబంధించిన ఫైలుపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.