కెనడాలో మరో ఘోరం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన యువరాజ్ గోయల్ అనే యువకుడిపై దుండగులు దగ్గర నుంచి కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో యువరాజ్ ప్రాణాలు కోల్పోయాడు. మూడు రోజుల కిందటే ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పంజాబ్లోని లుథియానాకు చెందిన యువరాజ్ ఐదేళ్ల కిందట ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం చేస్తున్నాడు. కెనడాలో శాశ్వత నివాస హోదా కూడా పొందాడు. కెనడా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం. ఇటీవల కొలంబియా సర్రే ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసులు అక్కడికి చేరుకునేలోగా యువరాజ్ ప్రాణాలు కోల్పోయాడు. అనుమానితులను అరెస్ట్ చేశారు. మృతుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసులు తెలిపారు. ఘటన కారణాలు తెలియాల్సి ఉంది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు