కేంద్ర మంత్రి వర్గంలో అనూహ్యంగా ఓడిపోయిన ఓ ఎంపీకి చోటు దక్కింది. పంజాబ్‌లో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వీడి రవనీత్ సింగ్ బిట్టు బీజేపీలో చేరారు.పంజాబ్ కాంగ్రెస్ అధినేత అమరీందర్ సింగ్‌పై బీజేపీ నుంచి పోటీ చేసి రవనీత్ ఓటమిపాలయ్యారు. పంజాబ్‌లో బీజేపీ ఒంటరిపోరు చేయాల్సి వచ్చింది. రైతు ఉద్యమం సమయంలో అకాలీదళ్ ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోయింది.
రవనీత్ ఓటమిపాలైనా ప్రభావం చూపగలిగిన నేతగా బీజేపీ భావిస్తోంది. వేర్పాటు వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ సీఎం బియాంగ్ సింగ్ మనవడు కావడం కూడా రవనీత్‌కు కలసి వచ్చింది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖిలిస్థాన్ సానుభూతి పరులైన అమృత్‌పాల్ సింగ్, ఇందిరా హంతకుడి కుమారుడు ఖల్సా ఇద్దరూ గెలుపొందారు. పంజాబ్‌లో మరలా వేర్పాటు వాదం బలపడుతోన్న సంకేతాలు రావడంతో బీజేపీ రవనీత్‌కు మంత్రి పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు బిట్టూకు కలసి వచ్చాయి.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు