టీ20 ప్రపంచ క్రికెట్ కప్‌లో పాక్‌పై భారత్ చమటోడ్చి విజయం సాధించింది. కేవలం 6 పరుగుల తేడాతో పాక్‌పై భారత జట్టు గెలుపొందింది. ఓ దశలో ఓటమి తప్పదనుకున్నారు. బుమ్రా 14 పరుగులకే 3 వికెట్లు తీయడంతో భారత్ పాక్‌పై టీ20 నెగ్గింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 19 ఓవర్లకు 119 పరుగులు చేసి ఆలౌటైంది. పాక్ బౌలర్లు నసీమ్ షా 3, రవూఫ్ 3, అమిర్ 2 వికెట్లు తీశారు.మహ్మద్ రిజ్వాన్ 31 పరుగులు మినహా బ్యాటర్లు చేతులెత్తేశారు. మొదటి మ్యాచ్‌లో భారత్ ఐర్లాండ్‌ను ఓడించింది. పాక్‌పై కూడా విజయం సాధించడంతో ఇక సూపర్ 8 చేరడం లాంఛనమే.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు విధించిన లక్ష్యం చిన్నదే అయినా పాక్ ఆటగాళ్లు తడబడ్డారు.మొదట్లో రిజ్వాన్ నిలకడగా ఆడాడు. 26 పరుగులకు ఒక వికెట్ కూడా పడలేదు. దీంతో భారత క్రికెట్ అభిమానుల్లో నైరాశ్యం నెలకొంది. బుమ్రా, బాబర్ రెచ్చిపోవడంతో కొద్దిగా ఆశలు చిగురించాయి. పది ఓవర్లకు పాక్ జట్టు 57 పరుగులు చేసి కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. రిజ్వాన్ పాతుకుపోయాడు. ఫకార్ రాగానే ఉతుకుడు మొదలుపెట్టాడు. 12 ఓవర్లకు స్కోరు 72కు చేరింది. 2 వికెట్లు పడ్డాయి. అక్కడ నుంచి పాక్ ఆటగాళ్లు వేగం పెంచారు. తరవాత టపటపా వికెట్లు కోల్పోయారు. లక్ష్యానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయారు. భారత జట్టులో రిషబ్ పంత్ 42, అక్షర్ పటేల్ 20 పరుగులు చేశారు.