బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ హత్య కేసులో కీలక పురోగతి లభించింది. కోలకతాలో హత్యకు గురైన అన్వరుల్ అజీమ్ అనర్ శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. అజీమ్ హత్యలో నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన శరీర భాగాలను ఓ మురుగు కాల్వలో గుర్తించారు. ఇప్పటికే ఎంపీ శరీర భాగాల్లో ఓ ముక్కను ఆయన బస చేసి అపార్టుమెంటు టాయిలెట్లో కనుగొన్నారు. ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుఫారీ అందుకున్నారనే ఆరోపణలపై ఇప్పటికే పోలీసులు ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు నేపాల్లో మరో నిందితుడిని అరెస్ట్ చేశారు.
బంగ్లాదేశ్ ఎంపీ అజీమ్ వైద్య సేవల నిమిత్తం కోల్కతాలోని ఆయన స్నేహితుడి ఇంటికి రాగా హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఓ మహళ హానీ ట్రాప్ వేసి ఎంపీని కోల్కతా రప్పించిందనే అనుమానాలున్నాయి. ఈ కేసులో ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఎంపీని హత్యచేసి శరీర భాగాలను ముక్కలుగా చేసి కోల్కతాలో అనేక ప్రాంతాల్లో పడేసినట్లు అరెస్టైన నిందితులు పోలీసులకు తెలిపారు. వారిచ్చిన ఆధారాలతో పోలీసులు శరీర భాగాలను వెలికితీస్తున్నారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు