2024 లోక్ సభకు 24 మంది ముస్లిం అభ్యర్థులు ఎన్నికయ్యారు. వీరిలో 21 మంది ఇండీ కూటమికి చెందిన వారే. తొమ్మిది మంది ముస్లిం ఎంపీలతో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉండగా మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ నుంచి ఐదుగురు ముస్లిం అభ్యర్థులు విజయం సాధించారు.
సమాజ్ వాదీ పార్టీ నుంచి నలుగురు, ఇండీయన్ ముస్లిం లీగ్ నుంచి ఇద్దరు, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒకరు ఉన్నారు. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ నుంచి గెలవగా, మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు.
1980 లోక్సభ ఎన్నికల్లో అత్యధికంగా 49 మంది ముస్లిం అభ్యర్థులు విజయం సాధించగా 1984 లోక్సభ ఎన్నికల్లో 45 మంది గెలిచారు. ఆ తర్వాత ముస్లిం ఎంపీల సంఖ్య లోక్ సభలో 40 దాటలేదు. 2014 ఎన్నికల్లో 11 ప్రధాన పార్టీలు మొత్తం 82 మంది ముస్లిం అభ్యర్థులను బరిలో నిలపగా 16 మంది మాత్రమే విజయం సాధించారు. 2019లో ఈ పార్టీలు 115 మంది పోటీకి దించగా 16 మంది అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు