జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ ఆదివారం ప్రకటించింది. జనరల్ కేటగిరీ అభ్యర్థుల కనీస కటాఫ్ 93.2 శాతంగా ఉంది. కటాఫ్ పర్సంటైల్ 2023లో 90.7, 2022లో 88.4గా ఉండగా ఈ దఫా మరింత ఎక్కువగా ఉంది.
ఐఐటీ దిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటి 360 మార్కులకు 355 సాధించి సీఆర్ఎల్లో టాపర్‌గా రికార్డుకెక్కాడు. ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ద్విజా ధర్మేశ్ కుమార్ పటేల్ 360 మార్కులకు 332 సాధించి సీఆర్ఎల్-7తో టాప్ మహిళా ర్యాంకర్‌గా ఘనత సాధించింది.
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష మే 26, 2024న దేశవ్యాప్తంగా రెండు సెషన్లలో జరిగింది. టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులు మాత్రమే అర్హత సాధించారు. jeeadv.ac.in సందర్శించి ఫలితాలు తెలుసుకోవచ్చు.