కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి ప్రాంతంలో సందడి మొదలైంది. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ పనులు మొదలయ్యాయి. దట్టమైన ముళ్ళ చెట్టులు, పిచ్చి చెట్లు, పొదలతో అడవిని తలపిస్తున్న ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నారు. సీఆర్డీఏ అధికారులు భారీ సంఖ్యలో పొక్లెయిన్లు, జేసీబీలను రప్పించి కంపలను తొలగిస్తున్నారు.
ఐఏఎస్ అధికారులు, ఉద్యోగుల బహుళ అంతస్తుల భవనాలు, జ్యుడిషియల్ క్వార్టర్స్, ప్రభుత్వ టైప్ – 1, టైప్- 2 భవనాలు, శాశ్వత రాజధాని నిర్మాణ పనులలో భాగమైన జీఏడీ మెగా టవర్ల ప్రాంతంలో భారీగా పిచ్చి చెట్లు ఉన్నాయి. వాటిని తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో మళ్లీ సందడి మొదలైంది. దట్టమైన ముళ్లకంపలు, పిచ్చి చెట్లు, పొదలతో చిట్టడవిలా మారిన అమరావతిలో సీఆర్డీఏ అధికారులు జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నారు. రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభమైన నేపథ్యంలో భారీ సంఖ్యలో పొక్లెయిన్లు, జేసీబీలను రప్పించి ఎక్కడిక్కడ మళ్లీ కంపలను తొలగించి శుభ్రం చేస్తున్నారు. ఐఏఎస్ అధికారులు, ఉద్యోగుల బహుళ అంతస్తుల భవనాలు, జ్యుడిషియల్ క్వార్టర్స్, ప్రభుత్వ టైప్ – 1, టైప్- 2 భవనాలు, శాశ్వత రాజధాని నిర్మాణ పనులలో భాగమైన జీఏడీ మెగా టవర్లు అన్నీ పిచ్చి చెట్లతో కమ్మేసుకున్నాయి.
కరకట్ట రోడ్డు, అత్యంత ప్రధానమైన సీడ్ యాక్సెస్ రోడ్డు, హైకోర్టు నుంచి తూళ్లూరుకు వెళ్లే రోడ్డు వెంబడి పొదలను తొలగిస్తున్నారు. ఎక్స్పీరియన్స్ సెంటర్ తాళాలు తెరిచి బూజు దులుపుతున్నారు. సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం నుంచి ఈ పనులు జరగనున్నాయి.