ప్రముఖ నటి, ఎంపీ కంగనాపై సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ దాడి తరవాత మొదటిసారిగా ఆమె స్పందించారు.కంగనాపై దాడి చేసిన కానిస్టేబుల్‌కు సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతోంది. దీనిపై నెటిజన్లకు కంగన పలు ప్రశ్నలు సంధించారు. రేపులు, హత్యలు జరిగినా మీకు పర్వాలేదా? అంటూ కంగన ప్రశ్నించారు. మహిళా కానిస్టేబుల్‌కు మద్దతుగా పోస్టులు పెడుతోన్న నెటిజన్లపై కంగన ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు.
నేరాలు చేసిన వారు తప్పించుకునేందుకు కారణాలు చెబుతుంటారు. నేరం చేసిన తరవాత కారణం వెతుకుతారు. నేరస్థుల భావోద్వేగాలకు విలువిస్తే, దాడి చేయడాన్ని సమర్థిస్తే, హత్యలు, అత్యాచారాలు జరిగినా కూడా పర్వాలేదనే మీ అభిప్రాయంగా భావించాల్సి ఉంటుందని కంగన సుదీర్ఘంగా పోస్ట్ చేశారు. ఇప్పటికైనా విముక్తి పొందండంటూ సలహా ఇచ్చారు.
కంగనపై చండీగఢ్ విమానాశ్రయంలో మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.