ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కొన్నిచోట్ల వర్షాలు పడుతుండగా మరో మూడురోజుల పాటు వానలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ వద్ద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో విస్తరించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాల్లో విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. దీంతో శనివారం, ఆదివారం రాష్ట్రంలో అక్కడక్కడా వానలు కురవనున్నాయి.
తెలంగాణలోనూ మరో మూడురోజుల పాటు మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నాయి.