ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్ సురక్షితంగా అంతరిక్ష కేంద్రం చేరుకున్నారు. ఆమెతోపాటు ఈసారి గణేశుడి విగ్రహం తీసుకెళ్లారు. గతంలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లినప్పుడు సునీతా విలియమ్స్ భగవద్గీత పట్టుకెళ్లారు. 2006, 2012లో ఆమె రెండు దఫాలు అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. తాజాగా మరోసారి అంతరిక్ష కేంద్రానికి సురక్షితంగా చేరుకుంది. ఆమె అంతరిక్ష కేంద్రంలో హుషారుగా డాన్స్ చేశారు. గతంలో ఆమె అంతరిక్ష కేంద్రంలోనే మారథాన్ నిర్వహించారు.
సునీతా విలియమ్స్ ఇప్పటి వరకు మూడు సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేశారు. ఇప్పటికే ఆమె 322 రోజులు ఐఎన్‌ఎస్‌లో గడిపారు. తాజాగా బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్‌లైనర్ మానవసహిత క్యాప్యూల్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. గతంలో ఈ క్యాప్యూల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. గురువారం నాడు కూడా హీలియం లీకైంది. అయినా సురక్షితంగా సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. ఆమె అంతరిక్ష కేంద్రంలోనికి ప్రవేశించే సమయంలో ఇప్పటికే అక్కడ ఉన్న ఏడుగురు శాస్త్రవేత్తలు గంటకొట్టి ఆమెకు ఘనస్వాగతం పలికారు.