ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్‌లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి కశ్మీర్ వేర్పాటువాది షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ రషీద్ ఇంజనీర్ విజయం సాధించాడు. ఎంపీగా ప్రమాణస్వీకారం చేయడానికి మధ్యంతర బెయిల్ కావాలంటూ అతను ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించాడు.
కశ్మీరీ ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, రషీద్ ఇంజనీర్‌పై కేసు నమోదు చేసింది. ఆ కేసులో భాగంగా 2019 ఆగస్టు 9 నుంచి అతను తీహార్ జైల్లో ఉన్నాడు.
ఇటీవలి ఎన్నికల్లో రషీద్ ఇంజనీర్ బారాముల్లా నుంచి పోటీ చేసాడు. జమ్మూకశ్మీర్ మాజీముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై 2లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.
ఇప్పుడు ఎంపీగా ప్రమాణస్వీకారం చేయడానికి, ఇతర పార్లమెంటరీ విధులు నిర్వర్తించడానికీ తనకు మధ్యంతర బెయిల్, కస్టడీ పెరోల్ కావాలంటూ బుధవారం న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకున్నాడు.
రషీద్ ఇంజనీర్ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరుగుతుంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు