రష్యాలో ఘోరం జరిగింది. చదువుకోవడానికి రష్యా వెళ్లి సెయింట్పీటర్స్బర్గ్ సమీపంలో నదిలో దిగిన నలుగురు భారతీయ విద్యార్థులు గల్లంతయ్యారు. వెలికీ నౌగోరాద్ స్టేట్ యూనివర్సిటీలో మెడిసిన్ చదవడానికి వీరంతా రష్యా వెళ్లినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన విద్యార్థులు మృతిచెందినట్లు అధికారులు గుర్తించారు. వారి మృతదేహాలను భారత్కు పంపేందుకు ఎంబసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రమాదవశాత్తూ నీట ముగిని చనిపోయిన వారిలో ఇద్దరు యవకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. వీరంతా 18 నుంచి 20 సంవత్సరాల వయసు వారే. జెయింట్పీటర్స్బర్గ్ సమీపంలోని వోల్గోవ్ రివర్ బీచ్లో ఆడుకుంటూ ఉండగా ఓ యువతి జారి నదిలో పడిపోయింది. ఆమెను రక్షించే క్రమంలో మిగిలిన వారు కూడా ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు స్థానిక మీడియా ద్వారా తెలుస్తోంది. చనిపోయిన విద్యార్థుల పూర్తి వివరాలు అందాల్సి ఉంది.