ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తాజా మాజీ సీఎస్ జవహర్‌రెడ్డి సెలవుపై వెళ్లిపోవడంతో, ఈ నియామకం చేపట్టారు. 1987 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ప్రస్తుతం అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు.
నీరభ్ కుమార్ ప్రసాద్‌ను అటవీ, పర్యావరణ శాఖ నుంచి వెంటనే రిలీవ్ చేయనున్నారు. కాసేపట్లో ఆయన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 12వ తేదీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిఉంది. కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి అవసరమైన పనులు చకచకా చేసేందుకు నీరభ్ కుమార్ ప్రసాద్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.ఇద్దరి ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌ల పేర్లు వినిపించినా చివరకు నీరభ్ కుమార్ నియామకానికే గవర్నర్ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.