ప్రపంచ ప్రఖ్యాత వ్యోమగామి, భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ గురువారం సురక్షితంగా అంతత్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. స్టార్‌లైనర్ స్పేష్‌షిప్ గురువారం రాత్రి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో సురక్షితంగా అనుసంధానమైంది. బోయింగ్ తయారు చేసిన క్యాప్య్సూల్‌కు గతంలో కొన్ని అవాంతరాలు ఎదురైన సంగతి తెలిసిందే. కొన్ని ఇబ్బందులు తలెత్తినా తాజాగా ఇది ఐఎన్‌ఎస్‌తో అనుసంధానమైంది.
దక్షిణ హిందూ మహాసముద్రంపైన నింగలో 400 కి.మీ ఎత్తులో అంతరిక్ష కేంద్రం ప్రయాణిస్తోంది. వ్యోమనౌక అంతరిక్ష కేంద్రానికి చేరే సమయంలో అందులోని వ్యవస్థలను సునీతా విలియమ్స్, విల్‌మోర్ పరీక్షించారు. ప్రయాణమార్గంలో క్యాప్సూల్‌ను హీలియం లీకేజీ ఇబ్బంది పెట్టింది. దీని వల్ల వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు.వ్యోమనౌకలో హీలియం నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని ఐఎన్‌ఎస్ తెలిపింది.